కిడ్నీ ఆపరేషన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కిడ్నీ రాకెట్ కేసులో 8 మంది బ్రోకర్లను గుర్తించారు పోలీసులు. దాదాపు 6 నెలల నుంచి అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో బెంగళూరుకి చెందిన డాక్టర్‌దే కీలకపాత్ర అని తెలుస్తోంది. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీల మార్పిడిలో సూత్రధారులు అని తెలుస్తోంది. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ. 55 లక్షలు తీసుకున్నారు డాక్టర్.
చెన్నై నుంచి ఇద్దరు మహిళలను తీసుకొచ్చి ఆపరేషన్ చేసారు డాక్టర్. బెంగళూరుకి చెందిన లాయర్, నర్స్‌కి కిడ్నీ మార్పిడి చేశారు. కిడ్నీ డోనర్లకు రూ. 5 లక్షలు చొప్పున నగదు చెల్లింపులు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి కోసం గాలింపు చేపట్టారు.