కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ కి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరాఖండ్ లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 43
మున్సిపాలీటిలు, 46 నగర పంచాయితీలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓటేసేందుకు ఆ రాష్ట్ర మాజీ సీఎం హరీశ్ రావత్ డెహ్రాడూన్ లో ఓ పోలింగ్ బూత్ కి వెళ్లారు. కానీ ఓటర్ల జాబితా లో ఆయన పేరు కనిపించలేదు. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఓటరు లిస్టు నుంచి ఆయన పేరు గల్లంతు అయినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై ఆయన స్పందిస్తూ 16 ఏళ్లుగా ఓటేస్తున్న నా పేరే లేకుండా పోయింది. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడే ఓటేసినట్లు చెప్పారు. ఓటర్ల లిస్టును బీజేపీ తారుమారు చేసినట్లు హరీశ్ రావత్ ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ ఘటన పై స్పందించిన ఈసీ కంప్యూటర్ సర్వర్లు మొరాయిస్తుని చెప్పిందని వెల్లడించారు. నేను వేచి చూస్తున్న అధికారుల నుంచి స్పందనే లేదంటూ ఆయన మండిపడ్డారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన డెహ్రాడూన్ లోని నిరంజన్పర్ ఏరియా నుంచి ఓటేసినట్లు చెప్పారు