పంచాయతీ రాజ్ రూరల్ అధికారులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

-

గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తాజాగా గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు ప్రజా భవన్ లో కలిసి పూల మొక్క అందజేసి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఎన్నడూ లేని విధంగా నిధులు మంజూరు చేసిన పనులు చేయిస్తున్నామని వెల్లడించారు. మొదటి విడుతలో రూ.2682 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 

తాజాగా మరో రూ.2773 కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు. ఇవే కాకుండా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.197 కోట్లు సాంక్షన్ చేసినట్టు స్పష్టం చేసారు. గతంలో పీఎంజీఎస్ వై కోసం రూ.110 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌళిక వసతుల కల్పన కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో మరిన్నీ నిదులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. అలాగే క్షేత్ర స్థాయి పంచాయతీ రాజ్ రూరల్ ఇంజనీరింగ్ అధికారులకు వాహన సదుపాయం కల్పించిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version