‘ఏడుపు’గొట్టు ఫంక్షన్ లు .. ఎందుకు ఏడుస్తున్నారయ్యా మీరు ?

-

తాము ఎంతో కష్టపడి నెలలు తరబడి తీసిన సినిమాలకు మైలేజ్ వచ్చేందుకు నటీనటులు ఎన్నో రకాలుగా ప్రమోషన్లు చేసుకుంటారు. తమ చిత్రాలు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రీ-రిలీజ్ వేడుకలను కూడా జరిపిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య నటీనటులకు ఒక కొత్త అలవాటు వచ్చినట్లు ఉంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లలో ఏదో ఒక విషయంపై ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి కన్నీరు కారిస్తే అదికాస్తా మన సోషల్ మీడియా పుణ్యమా అని ట్రెండింగ్ అయి వారి సినిమాకు మంచి ప్రమోషన్ దొరుకుతుంది.

 

ఈ ఆచారాన్ని మొట్టమొదటిగా షురూ చేసింది నిన్న మొన్నటిదాకా చిరంజీవితో వివాదంలో వార్తల్లోకెక్కిన హీరో రాజశేఖర్. తన కమ్ బ్యాక్ సినిమా అయిన గరుడవేగ ప్రమోషన్ లో భాగంగా స్టేజి మీద ఏడవడం సినిమా హిట్ అవడానికి కారణం అయిందని పలువురు చెబుతుంటారు. అతను అలా చేసే సరికి జాలితో ప్రేక్షకులు సినిమాను చూశారని అన్నారు. అంతేకాకుండా మొన్న చపాక్ సినిమా కి సంబంధించిన ఒక కార్యక్రమం సందర్భంగా కూడా దీపిక తాను ఆ పాత్ర చేస్తున్నప్పుడు యాసిడ్ బాధితుల అవస్థను స్వయంగా అనుభవించానని చెబుతూ స్టేజి మీద కన్నీరుమున్నీరు అయింది.

ఇక టాలీవుడ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పలుమార్లు స్టేజీపైన ఎమోషనల్ కాగా పది రోజుల వ్యవధిలో సక్సెస్ మీటింగ్ లో ఆ బాధ అంతా మరిచిపోయి నవ్వుతూ కనిపించాడని యాంటీ ఫ్యాన్స్ కూడా అప్పుడు అతనిని ట్రోల్ చేశారు. నిన్న అల్లు అర్జున్ కూడా ఎవరూ ఊహించని విధంగా స్టేజి మీద అలా ఏడిస్తే సింపతీ వస్తుందని ప్లాన్ అని చెబుతున్నారు. ఇలా రాజశేఖర్ చేసిన ఈ అలవాటుని పాటిస్తే ప్రతీసారీ సినిమాలకి వెళ్ళేందుకు ప్రజలేమీ పిచ్చోళ్ళు కాదు కదా.

Read more RELATED
Recommended to you

Exit mobile version