కేజీఎఫ్ హీరో యష్ సినిమా ఎఫ్ఐఆర్ పై స్టే విధించిన హైకోర్టు

-

కేజీఎఫ్ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తాజాగా నటిస్తొన్న మూవీ టాక్సిక్. ఈ సినిమా నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ సినిమా నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ లు రిలీవ్ అయ్యారు. టాక్సిక్ మూవీ యూనిట్ అటవీ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ చిత్ర నిర్మాణ సంస్థలు కేవీఎన్, మాన్సర్ట్ మైండ్స్ పై రాష్ట్ర అటవీ శాఖ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు అయింది.

ఈ ఎఫ్ఐఆర్ పై తాజాగా స్టే విధించింది బెంగళూరు హైకోర్టు. బెంగళూరు శివార్లలోని హెచ్ఎంటీ మైదానంలో టాక్సిక్ మూవీ సెట్ ను నిర్మించారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి ఇక్కడ సెట్ ను నిర్మించారు. అయితే సెట్ ను నిర్మించేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే మైదానంలో ఉన్న చెట్లను అక్రమంగా నరికివేశారని అటవీశాఖ ఆరోపిస్తూ.. దీనిపై ఓ న్యాయవాది కోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ ను కూడా దాఖలు చేశారు. సెట్ నిర్మించిన భూమి అటవీ భూమి కాదని ప్రభుత్వమే కోర్టుకు తెలిపింది. షూటింగ్ సెట్ వేయడానికి చెట్లను కూడా నరకలేదని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తులు మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news