కేవలం ఆరు నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వం పై భారీ వ్యతిరేకత వచ్చిందని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. 2025 జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన ప్రారంభమవుతుందని.. ప్రతీ పార్లమెంట్ లో బుధ, గురు వారాలలో తాను నిద్ర చేస్తానని వెల్లడించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటి సారి చూస్తున్నానని.. వైసీపీ నేతలు ప్రజల్లోకి సగర్వంగా వెళ్లవచ్చన్నారు. వైసీపీకి గత ఎన్నికల్లో 50 శాతం ఓట్ షేర్ వస్తే.. ఈ సారి 40 శాతం వచ్చిందని జగన్ తెలిపారు.
అతి నిజాయితీ, అతి మంచితనం నాలో ఉన్న సమస్య అని.. మన పార్టీ వాళ్లు చెప్పారు. వాటి వల్లనే మరలా వైసీపీ అధికారంలోకి వస్తుంది. పథకాలు ఇవ్వకుండా పథకాలు ఎలా ఉన్నాయని అడుగుతారంట. అన్ని వర్గాల ప్రభుత్వ తీరు పట్ల ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్దానాలు అమలు చేశామని.. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే బడ్జెట్ తో పాటు సంక్షేమ క్యాలండర్ ను విడుదల చేసి.. బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని తెలిపారు.