కన్నడ సీరియల్ నటి గచ్చిబౌలిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మే 22న పెళ్లి చేసుకున్న శోభిత.. ఆ తర్వాత బుల్లితెరకు దూరం అయ్యింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శోభిత ఇప్పటి వరకు తన పెళ్లి ఫోటోలను షేర్ చేయకపోవడం ఆశ్చర్యకరం. ఆమె తన భర్తతో ఒక్క ఫోటో కూడా షేర్ చేయని శోభిత.. ఎవరిని పెళ్లి చేసుకుంది అనే విషయాన్ని కూడా చెప్పకుండా సీక్రెట్ గా ఉంచింది.
అయితే శోభిత ఉరి వేసుకున్న ఇంటి ఓనర్ ఆమె బంధువు. ఈ ఘటన పై ఇంటి ఓనర్ మాట్లాడుతూ.. నా అపార్ట్మెంట్ లోనే ఏడాదిన్నర గా ఉంటున్నారు. ఆమె భర్త సుధీర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇద్దరూ బాగానే ఉంటారు. ఎలాంటి విభేదాలు లేవు. లాస్ట్ వీక్ గోవా కూడా వెళ్ళి వచ్చారు. నిన్న రాత్రి భర్త కి వర్క్ ఉండి.. కంటిన్యూస్ కాల్స్ వల్ల హాల్ లో పడుకున్నాడు. శోభిత బెడ్ రూం లో పడుకుంది. ఉదయం తలుపు తీయకపోయేసరికి సుధీర్ నాకు చెప్పాడు. వెళ్ళి తలుపు బద్దలు కొట్టి చూసాము. అప్పటికే ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ఇంకా తెలియడం లేదు అని ఆమె పేర్కొంది.