ములుగు జిల్లా.. ఏటూరునాగారం మండలం చల్పాకలో జరిగిన ఎన్కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం చేసింది పౌర హక్కుల సంఘం తెలంగాణ. అన్నంలో విష ప్రయోగం జరిగింది. నిపుణులైన వైద్యుల శవ పరీక్షలు నిర్వహించాలి అని డిమాండ్ చేసింది. రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చిన 12 నెలలలో 16 మంది ఎన్కౌంటర్ పేరుతో చనిపోయారు. ఈ చావులు అన్ని బూటకపు ఎన్కౌంటర్ లే అని పేర్కొంది.
అయితే ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందిన ఏడుగురి మావోయిస్టు మృతదేహాలను ములుగు ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు పోలీసులు. మావోయిస్టుల మృతదేహాలు భద్రపరచడం కోసం 7 ఫ్రీజర్ బాక్స్ లను సిద్ధం చేసిన పోలీసులు.. ఆదివారం సెలవు కావడంతో రేపు మావోయిస్టుల మృతదేహాల పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు అధికారులు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు పోలీసులు. అయితే మావోయిస్టుల మృతదేహాలకు పోరిన్సిక్ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు అధికారులు.