Hrithik Roshan : హృతిక్ రోషన్ గ్యారేజ్ లో ఎన్ని లగ్జరీ కార్లున్నాయో చూశారా..?

-

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అంటే అమ్మాయిలు పడిచచ్చిపోతుంటారు. బాలీవుడ్​ మోస్ట్ ఫిట్​ యాక్టర్​.. ది మోస్ట్ హ్యాండ్సమ్​ హంక్​గా పేరు తెచ్చుకున్నాడు హృతిక్. క్రిష్ ఫ్రాంచైజీతో ఇండియన్ ఆడియెన్స్ కు సూపర్ హీరో లేడనే లోటును తీర్చాడు. హృతిక్ రోషన్​కు కార్లంటే చాలా ఇష్టమట. తన గారేజ్ లో ఉన్న ఫేవరెట్ కారు తీసుకుని అలా ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టడమంటే ఈ గ్రీడ్ గాడ్ కు చాలా సరదానట. అందుకే హృతిక్ చాలా రకాల లగ్జరీ కార్లు హృతిక్ గ్యారేజ్​లో ఉన్నాయట. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?
హృతిక్ దగ్గర Audi Q7 మోడల్​ ఉంది. దీని ధర కోటి 10 లక్షల వరకు ఉంటుంది.
హృతిక్​ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ ఉంది. దీని ధర దాదాపు 5 కోట్ల 32 లక్షలు. 42వ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ ఈ కారును కొనుగోలు చేశాడని సమాచారం.
Mercedes Benz S క్లాస్ కూడా హృతిక్​ గ్యారేజ్​లో ఉంది. దీని ఖరీదు 2 కోట్లు 80 లక్షల వరకూ ఉంటుంది.
Mercedes V క్లాస్ ను సైతం ఇంటికి ఆహ్వానించాడు బాలీవుడ్​ హీరో. దీని విలువ కోటిన్నర వరకు ఉంటుందని అంచనా.
మినీ కూపర్ కన్వర్టిబుల్ కూడా హృతిక్ కలెక్షన్​లో ఉంది. దీని ధర 40 లక్షల వరకూ ఉంటుంది. రోజువారీ అవసరాల కోసం హృతిక్ దీన్నే వినియోగిస్తాడని టాక్.
హృతిక్​ గ్యారేజ్​లో మరో ఖరీదైన కారు ఫెరారీ 360 మోడెనా కూడా ఉంది. మన దేశంలో అతి తక్కువ మంది దగ్గర ఈ కారు ఉంది. దీని ధర 4 కోట్లు.
హృతిక్ వద్ద అరుదైన 1996 నాటి ఫోర్డ్ ముస్తాంగ్​ వింటేజ్ కారు కూడా ఉంది. ఈ కారు మోడల్​ అందుబాటులో లేక చాలా కాలమైంది.
పోర్షే టర్బో కారుకు సైతం వెల్కమ్​ చెప్పాడు హృతిక్. దీని ధర 2 కోట్ల మేర ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version