వావ్‌.. రజనీ ‘జైలర్‌’ నుంచి సునీల్‌ ఫస్ట్‌లుక్‌

-

రజనీకాంత్ కథానాయకుడిగా ‘జైలర్’ సినిమా రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ ‘జైలర్’గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. కథ అంతా కూడా జైలుతో ముడిపడిన జైలర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఆయన పాత్ర .. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉండనున్నాయనే సంగతి ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇక ఇతర ముఖ్యమైన పాత్రలలో రమ్యకృష్ణ .. శివరాజ్ కుమార్ .. యోగబాబు కనిపించనున్నారు.

ప్రత్యేకమైన పాత్రను మోహన్ లాల్ పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, ఏప్రిల్ 14వ తేదీన తమిళంతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. కోలీవుడ్ అగ్ర హీరో ర‌జ‌నీకాంత్‌, మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్ ఫ‌స్ట్ టైమ్ వెండితెర‌పై క‌లిసి న‌టించ‌బోతున్నారు. ర‌జ‌నీకాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న జైల‌ర్ సినిమాలో మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. అత‌డి ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version