హృతిక్ రోషన్ ఫిట్నెస్ ట్రైనర్ జీతం తెలిస్తే షాక్..!

-

బాలీవుడ్ స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన వయసు ఇప్పుడు 50 ఏళ్లకు పై మాటే.. అయినా కూడా యంగ్ గా కనిపించే ఈయన ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ తన బాడీని బిల్డ్ చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ బాడీతో అద్భుతమైన యాక్షన్ స్టంట్ లతో అదిరిపోయే స్టెప్పులతో ఈ వయసులో కూడా అభిమానుల చేత విజిల్స్ వేయిస్తున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .70 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న ఈయన తన ఫిట్నెస్ కోసం కూడా అంతే రేంజ్ లో ఖర్చు పెడుతున్నారని సమాచారం. అందుకే ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదని చెప్పవచ్చు. ఇకపోతే ఆయన దగ్గర పనిచేస్తున్న ఫిట్నెస్ ట్రైనర్ ఏడాది జీతం తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. ప్రతిరోజు జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేస్తున్న హృతిక్ రోషన్.. తనను ట్రైన్ చేయడం కోసం ఒక పర్సనల్ జిమ్ ట్రైనర్ ను కూడా నియమించుకున్నారు.

ఇక ఆ ట్రైనర్ పేరు క్రిస్ గెతిన్.. ఇతను యూకే కి చెందిన వారని సమాచారం. ఇకపోతే ఈయనకు ఏడాదికి సుమారుగా రూ.3 కోట్లకు పైగా జీతం చెల్లిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలిసి అభిమానులు ఈ డబ్బుతో ఒక చిన్న సినిమా తీయొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఫిట్నెస్ కోసం ఇంత ఖర్చు చేస్తున్న ఏకైక హీరో కూడా ఇతడే నేమో అంటూ నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఫైటర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈయన ..ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 చిత్రంలో నటించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version