‘వాల్తేరు వీరయ్య’ చిత్రబృందానికి చిరంజీవి సర్ ప్రైజ్

-

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా ఈ సంక్రాంతి బరిలో దిగారు. బాబీ డైరెక్షన్ లో శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై తెలుగు ప్రేక్షకుల నీరజనాలు అందుకుంటోంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో చిత్రబృందం  సక్సెస్ మీట్  ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ ఓ సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ చిరు ఇచ్చిన సర్ ప్రైజ్ ఏంటంటే..?

ఈ సినిమా వెనక ఉన్న కష్టం నాదో రవితేజదో కాదు. ఈ సినిమా కోసం కష్టపడ్డ కార్మికులది. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ కార్మికులు పడ్డి కష్టాన్ని కళ్లారా చూశాను. వారి కష్టాన్ని ప్రపంచానికి చూపించాలని ఆ షాట్స్ ను నా మొబైల్ తో నేనే స్వయంగా షూట్ చేశాను. ఆ కష్టాన్ని ప్రేక్షకులు చూస్తే.. వాళ్లని మనం సినిమా చూడమని అడగనవసరం లేదు. ఈ సినిమా కోసం మనం పడిన కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్లే థియేటర్లకు వస్తారు. అని తాను తీసిని వీడియోను సక్సెస్ మీట్ లో ప్రసారం చేసి వాల్తేరు వీరయ్య చిత్రబృందానికి చిరంజీవి సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఈ వీడియో చూసిన చిత్రబృందం చాలా ఎమోషనల్ అయింది. డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ వీడియో చూసి ఎమోషనల్ అయి చిరు కాళ్లకు నమస్కరించారు. ఇక మాస్ మహారాజ రవితేజ చిరంజీవిని గట్టిగా కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు మెగాస్టార్ ను తెగ పొగిడేస్తున్నారు. కష్టం విలువ తెలిసిన వాడికే ఎదుటి వాళ్ల కష్టం కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version