పుష్ప- 2 సినిమా నేపథ్యంలో వాహనదారులకు బిగ్ అలర్ట్. నేడు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప- 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ ఉండనుంది. ఈ తరునంలోనే.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. దీంతో భారీగా తరలిరానున్నారు బన్నీ ఫ్యాన్స్.
దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా జూబ్లిహిల్స్, అమీర్ పేట్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, జూబ్లీ చెక్ పోస్టుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
ఇక అటు అల్లు అర్జున్ గతంలో నంద్యాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి, పుష్ప2 సినిమాకు లింక్ చేస్తూ టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.