రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, ఈ ప్రభుత్వానికి చేతగాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్‌కు అప్పగించాలని, అప్పుడు విద్యార్థులను కాపాడుకుంటామని గులాబీ పార్టీ కీలక నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రం అనేక సమస్యలకు నెలవుగా మారిందన్నారు.
గురుకుల, మోడల్ స్కూళ్లల్లో విద్యార్థులకు సరైన భోజనం అందించడం లేదని, ఫలితంగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ విద్యాశాఖను దగ్గర పెట్టుకుని సమీక్షలు నిర్వహించడం లేదని, ఫలితంగా విద్యావ్యవస్థ అధ్వాన్నంగా తయారైందని అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖకు మంత్రిని నియమించాలని లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.