నాకు అలాంటి వంటే పిచ్చి.. దీపికా పదుకొనే..!!

-

గ్లోబల్ స్టార్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారింది. అంతేకాదు అప్పుడప్పుడు ఫోటోషూట్స్ తో గ్లామర్ స్టార్ గా పేరు దక్కించుకుంది. ఇటీవలే పఠాన్ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్లో కూడా దీపిక చేరిన విషయం తెలిసిందే. షారుక్ ఖాన్ తో కలిసి ఆ సినిమాలో నటించిన ఈమె ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య కూడా చాలా పెద్దగా ఉందని చెప్పాలి. అందులో ఒకటి రెండు సినిమాలైనా సరే తప్పకుండా వెయ్యి కోట్ల సినిమాలుగా నిలుస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా సమయం దొరికితే చాలు అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ నిర్వహించే ఈమె తాజాగా మరొకసారి చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక ఫ్యాన్ మీ ఆల్ టైం ఫేవరెట్ కార్టూన్ షో ఏంటి అంటూ ప్రశ్నించగా.. ఆమె స్పందిస్తూ స్కూబీ డూ తన ఆల్ టైం ఫేవరెట్ కార్టూన్ షో అంటూ చెప్పకు వచ్చింది. అంతేకాదు ఆ షో కోసం తాను థీమ్ సాంగును కూడా పాడినట్లుగా తెలియజేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే కార్టూన్ షో స్కూబీ డూ ను గ్లోబల్ స్టార్ అయిన దీపికా పదుకొనే అభిమానించడం ఇప్పుడు మరింత ఆశ్చర్యంగా మారిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో రూపొందుతున్న ప్రభాస్ మూవీ ప్రాజెక్టు కె సినిమాలో ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు హిందీలో హృతిక్ రోషన్ సినిమాలో కూడా నటిస్తోంది. ఏది ఏమైనా తనకు ఇష్టమైన కార్టూన్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది గ్లోబల్ స్టార్.

Read more RELATED
Recommended to you

Latest news