‘మహీ భాయ్‌.. ఈ గెలుపు నీకే అంకితం’.. జడేజా పోస్టు వైరల్

-

ఐపీఎల్ 2023 సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్ విజయ ఢంకా మోగించింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సీఎస్కే, ధోనీల జపమే నడుస్తోంది. ధోనీ ప్రస్తుతం నెట్టింట మరోసారి ట్రెండింగ్​లో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ గెలుపునకు కృషి చేసిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవీంద్ర జడేజా. కీలక సమయంలో రవీంద్ర జడేజా సిక్స్‌, ఫోర్‌ కొట్టి చెన్నై ఐదోసారి కప్పు గెలుచుకునేలా చేశాడు. ఎప్పుడూ తన భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉండే ధోనీ తొలిసారి సంబురపడ్డాడు.

తాజాగా జడ్డూ కూడా తన ట్విటర్ వేదికగా ధోనీని ఉద్దేశించి ప్రత్యేక పోస్టు పెట్టాడు. ‘‘ఇది కేవలం ఎంఎస్ ధోనీ కోసం మాత్రమే చేశాం. మహీ భాయ్‌ నీ కోసమే ఏదైనా..’’ అని జడ్డూ ట్వీట్ చేశాడు. సోమవారం అర్ధరాత్రి మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ఇదే విషయం గురించి జడ్డూ ప్రత్యేకంగా మాట్లాడాడు.

‘‘నా సొంత రాష్ట్రంలోని అభిమానుల మధ్య సీఎస్‌కే ఐదో టైటిల్‌ను గెలవడం అద్భుతంగా అనిపించింది. సీఎస్‌కేకు మద్దతుగా నిలవడానికి భారీగా తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. వర్షం తగ్గాలని రాత్రంతా వేచి చూశారు. సీఎస్‌కే అభిమానులకు శుభాకాంక్షలు చెబుతున్నా. ఈ అపూర్వ విజయాన్ని ఒకే ఒక వ్యక్తి కోసం అంకితం చేస్తున్నాం. మా కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ కోసమే గెలిచాం. సీఎస్‌కే అభిమానులు ఎల్లవేళలా ఇలాగే మద్దతు ఇస్తూ ఉండాలి.’’ అని జడేజా పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news