ఆమె వల్లే బ్రతుకాను.. కళ్యాణ్ రామ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

-

బింబిసారా సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు జోష్ పెంచేశారు. ఇటీవల రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం అమిగోస్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ కు కొద్దిరోజులే ఉండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలో చేస్తూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

అందులో భాగంగానే తన భార్య గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.. తన చేతి పై తన భార్య పేరు స్వాతి అని పచ్చబొట్టు వేయించుకోవడం వెనుక ఉన్న కథను కూడా ఆయన తెలిపారు. ఎవరైనా తన లవర్ పేరు, తల్లి పేరు టాటూ వేయించుకుంటారు.. మీరు మీ భార్య పేరు టాటూ వేయించుకున్నారు.. మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా మీ భార్య పేరు చేతి పై వేయించుకొని అందరికీ చూపిస్తూ ఉంటారు.. ఆ టాటూ కథ ఏంటి అని యాంకర్ అడగగా..కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. 2007 – 2008 మధ్య నాకు ఆరోగ్య సమస్యలు బాగా వచ్చాయి. అవి మొత్తం ఇప్పుడు చెప్పడం కష్టం . ఆరోగ్యం అసలు బాగోలేదు. అందరి భార్యలు అలాగే చేస్తారు . కాదనడం లేదు కానీ నా విషయానికి వస్తే సాధారణంగా నర్స్ లను పెట్టి చూసుకోమని చెప్పేస్తారు. కానీ నా భార్య నర్స్ లను కూడా వద్దని తానే దగ్గర నుండి చూసుకుంది. ఎందుకంటే తనకు నా గురించి బాగా తెలుసు.

ఇంజక్షన్ కూడా చేయించుకోవడానికి భయపడతాను. మా పదవ పెళ్లిరోజున తనను అడిగాను.. నీకేం కావాలి.. ఏదైనా ఇస్తాను అని.. కానీ తాను మాత్రం నాకేం వద్దు.. అన్ని ఉన్నాయి.. పక్కన మీరు ఉన్నారు.. పిల్లలు ఉన్నారు ..అది చాలు అని చెప్పింది.. దాంతో నేను ఈ టాటూ వేయించుకున్నాను.. ఆమె లేకపోతే నేను లేను.. అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version