నేను బిగ్ బాస్ రేసులో లేను.. నన్ను అనవసరంగా లాగొద్దు..!

-

తెలుగుతో పాటు హిందీ, మలయాళం సినిమాల్లో నటించిన శోభిత ఈసారి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయిందంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలను శోభిత కొట్టిపారేసింది.

ఇప్పుడు బిగ్ బాస్ ఫీవర్ పట్టుకుంది అందరికీ. కంటెస్టెంట్లు ఎవరు? ఎప్పుడు షో ప్రారంభం అవుతుంది. ఎంతమంది కంటెస్టెంట్లు, ఈసారి షో ఎలా ఉండబోతోంది.. అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హోస్ట్ కన్ఫమ్ అయ్యారు. కాకపోతే కంటెస్టెంట్ల విషయంలోనే క్లారిటీ లేదు. కాకపోతే.. బిగ్ బాస్ లో వాళ్లు వస్తున్నారు.. వీళ్లు వస్తున్నారు.. అంటూ వార్తలు వస్తున్నాయి. వాటిని కొందరు సెలబ్రిటీలు కొట్టిపారేస్తున్నారు కూడా. వారిలో శోభిత దూళిపాళ్ల ఒకరు. ఎవరు ఈమె. గుర్తొచ్చిందా? అడవి శేష్‌ ‘గూఢచారి’లో హీరోయిన్‌. తెలుగు అమ్మాయే. తెనాలి. మోడల్, నటి. మిస్ ఎర్త్ 2013లో ఇండియను రిప్రజెంట్ చేసింది శోభితే.

తెలుగుతో పాటు హిందీ, మలయాళం సినిమాల్లో నటించిన శోభిత ఈసారి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయిందంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలను శోభిత కొట్టిపారేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో నేను కంటెస్టెంట్ ను కాదు. మీ పీఆర్ కోసం నా పేరు వాడుకోకండి.. అంటూ ఆమె మీడియా పంచ్ వేసింది. తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసి.. బిగ్ బాస్ రేసులో లేనని క్లారిటీ ఇచ్చింది శోభిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version