”గోవింద” యాప్‌తో తిరుమల శ్రీవారి దర్శనం మ‌రింత‌ సులభం..

-

ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నాక రిజిస్టర్ చేసుకోవడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలి. వాటి ద్వారా యాప్ లో రిజిస్టర్ చేసుకొని ఏంచక్కా ముందే టికెట్లు బుక్ చేసుకొని హాయిగా తిరుపతి టూర్ ను వెళ్లిరండి.

తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే కలిగే ఆనందమే వేరు. కానీ.. తిరుపతిలో కలిగే అసౌకర్యాలను గుర్తు తెచ్చుకొని చాలామంది తిరుపతికి వెళ్లాలంటేనే భయపడతారు. అక్కడ జనాలు.. దర్శనానికి గంటలు గంటలు వెయిట్ చేయడం.. రూములు దొరుకుతాయో లేదో, ఇలా సవాలక్ష సమస్యలు ఎదురవుతాయి తిరుపతికి వెళ్లాలంటే. అయితే.. ఇక నుంచి ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు ఇక.

దానికి పరిష్కారం ఇప్పుడు మీ అరచేతిలోనే ఉంది. అవును.. మీదగ్గర ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. తిరుమల వెంకన్నను ఎంతో సులభంగా దర్శించుకోవచ్చు. దానికి కావాల్సింది ఒక యాప్. దాని పేరు గోవింద. అవును.. గోవింద యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ లో డౌన్ చేసుకోండి.

తిరుపతికి టూర్ వెళ్లాలనుకుంటే.. ఆ యాప్ లోకి వెళ్లి.. మీరు అనుకున్న తేదీన రూమ్ లను, ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక దర్శనం టికెట్లు, విశేష పూజ, కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఉజ్వల్ సేవ, సహస్ర దీపాలంకారణ, ఆర్జిత బ్రహోత్సవం లాంటి ఎన్నో సేవలకు సంబంధించిన టికెట్లను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నాక రిజిస్టర్ చేసుకోవడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలి. వాటి ద్వారా యాప్ లో రిజిస్టర్ చేసుకొని ఏంచక్కా ముందే టికెట్లు బుక్ చేసుకొని హాయిగా తిరుపతి టూర్ ను వెళ్లిరండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version