శృతిహాసన్ తల్లిగా నటిస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా …?

-

కమల్ హాసన్ కూతురు అన్న ట్యాగ్ తో శృతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంటరయింది. తమిళంలో సినిమా చేసింది. అలాగే తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాలో సిద్దార్థ్ తో కలిసి నటించిన సినిమాతో పరిచయమైంది. కాని ఈ సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలాయి. దాంతో శృతిహాసన్ కి ఐరెన్ లెగ్ అన్న పేరు పెట్టారు. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కాని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గబ్బర్ సినిమా లో శృతిహాసన్ కి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దీంతో ఇక శృతిహాసన్ ఫేట్ మారిపోయింది. వరసగా తెలుగులో, తమిళంలో అవకాశాలు అందుకుంది. చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పాపులర్ అయింది. కాని మధ్యలో మళ్ళీ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. సినిమాలకి బాగా గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు సినిమాలు చేస్తుంది. అలా తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటిస్తుంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. డాన్‌ శీను, బలుపు రవితేజ కి హిట్స్ ఇచ్చాడు గోపిచంద్‌ మలినేని. ఈ సినిమా గనక హిట్ అయితే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కాంబినేషన్ గా పేరు దక్కించుకుంటారు. అంతేకాదు వాస్తవంగా ఈ సినిమా హిట్ రవితేజ కి, గోపిచంద్‌ మలినేని, శృతిహాసన్ లకి చాలా కీలకం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శృతిహాసన్ క్రాక్ సినిమాలో ఒక బిడ్డ కి తల్లిగా నటిస్తుందట. మొదటిసారి తల్లి పాత్రలో నటిస్తున్నందుకు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version