నాగార్జున ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నవ మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున వేలకోట్లకు అధిపతి అన్న విషయం బహుశా చాలామందికి తెలుసు అని చెప్పాలి. అయితే ఆయన ఆస్తి ఎంత ఉంది అనేది మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా చాలా వరకు తన తండ్రి స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఆస్తులు వస్తే స్వతహాగా ఆయన కూడా బాగానే కూడబెట్టారు. ముఖ్యంగా ఇండియన్ రిచెస్ట్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. వేలకోట్ల అధిపతిగా రాణిస్తున్న నాగార్జున ఒకవైపు హీరోగా, మరొకవైపు నిర్మాతగా, బ్రాండ్ అంబాసిడర్ గా, హోస్ట్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, స్టూడియో అధినేతగా, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దూసుకుపోతూ రెండు చేతుల భారీగా సంపాదిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలి అంటే మల్టీ బిజినెస్ లు ఆయన సొంతం .అందుకే ఆయన ఆస్తులు, సంపాదన కూడా అందరిని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. వాస్తవానికి హీరోగా ఆయన తీసుకునే పారితోషకం చాలా తక్కువే అయినా ఇతర మార్గాల ద్వారా ఆయనకు భారీగా ఆదాయం వస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కేవలం రూ.10 కోట్లలోపే పారితోషకం తీసుకుంటున్న నాగార్జున ఇప్పుడు బిగ్బాస్ సీజన్ సెవెన్ కి కూడా రూ.20 కోట్లలోపే పారితోషకం తీసుకుంటున్నారు.

ఏఎన్ఆర్ 3 స్టూడియోస్ ని నిర్మించారు. అందులో అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ , ఎన్ కన్వెన్షన్ సెంటర్. వీటిలో సినిమా ఓపెనింగ్లు, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సీసీ వర్క్ జరుగుతుంటాయి. అలాగే టీవీ షోలు కూడా చేస్తూ ఉంటారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫిలిం స్కూల్ ని కూడా నడిపిస్తున్నారు. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ స్టాండర్డ్స్ ని అందిస్తున్నారు. వీటి ద్వారా కోట్ల రూపాయల లాభం లభిస్తుంది. అలాగే పబ్బులు హోటల్స్ కూడా రన్ చేస్తున్నారు. ఇక కార్ల విషయానికి వస్తే బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్, ఆడి ఏ7 సిరీస్, బెంజ్ కార్లతో పాటు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఒక జెట్ కూడా ఉంది. మొత్తానికి రూ.5 వేల కోట్లకు పైగా నాగార్జున ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version