IFFM Awards 2023: టాలీవుడ్ నుంచి అరుదైన అవార్డు అందుకున్న సీతారామం..!

-

హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా , బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెలుగులో నటించిన చిత్రం సీతారామం.. ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించడమే కాదు ఎన్నో రకాల అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఖాతాలోకి మరో అవార్డు వచ్చి చేరిందని చెప్పాలి. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ ఐ ఎఫ్ ఎఫ్ ఎం అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్రంగా అవార్డును కైవసం చేసుకోవడం గమనార్హం.

కన్నీటితో రాసిన మధురమైన ప్రేమ కావ్యం ఈ సినిమా.. సినీ ప్రేక్షకులను అలరించి దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించి పలు అవార్డులను కూడా దక్కించుకుంది ముఖ్యంగా ఈ సినిమాలో సీత , రామ్ గా మృనాల్ ఠాకూర్ , దుల్కర్ సల్మాన్ చెప్పిన ప్రతి మాట , పలికించిన ప్రతి భావాన్ని ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఆస్వాదించారు. అంతేకాదు అప్పట్లో తమకు నచ్చిన సన్నివేశాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సినిమాపై తమకున్న ప్రేమను కూడా చాటుకున్నారు.. అయితే ఇప్పుడు ఇదే రొమాంటిక్ పిరియాడిక్ డ్రామా మూవీ మరో అవార్డును సొంతం చేసుకుంది .ఉత్తమ చిత్రంగా నిలిచి సినిమాపై ఉన్న అభిమానాన్ని చాటుకునేలా చేసింది. ఇందులో మృనాల్ ఠాకూర్ కు డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డు కూడా లభించింది.

ఇకపోతే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతకుమించి పాపులారిటీని దక్కించుకుంది. వీరితోపాటు మరొకవైపు మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాకి గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ఉత్తమ నటి అవార్డును అందుకోగా.. ఆగ్రా చిత్ర నటుడు మోహిత్ అగర్వాల్ ఉత్తమ నటుడిగా అవార్డును కైవసం చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కరణ్ జోహార్ ను కూడా సత్కరించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news