భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇండియన్‌ 2 ఇంట్రో వ‌చ్చేసింది

-

తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్‌-2 ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. ఇక శంకర్‌ డైరెక్షన్‌లో వ‌చ్చిన ఈ సినిమాలో కమల్‌ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. అయితే అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వ‌స్తుంది. అయితే కొన్నాళ్ళుగా ఎలాంటి అప్‌డేట్ లేకుండా వున్న‌ ‘ఇండియన్‌ 2′ ప్రాజెక్ట్ ఇప్పుడు మరో అడుగుముందుకు వేసింది.

తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. మేక‌ర్స్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండియన్‌-2 ఇంట్రో రిలీజ్ విడుద‌ల చేశారు.ఇక ఈ ఇంట్రోను తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి విడుద‌ల చేశాడు. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. జైల‌ర్ ఫేమ్ అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాను రెడ్ జెయింట్‌, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆ మధ్య ఇండిపెండెన్స్‌ డేకు రిలీజైన కమల్‌ లుక్‌కు విశేష స్పందన వచ్చింది. మ‌రోవైపు విక్రమ్ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుకొని మంచి ఫామ్ లో కమల్ హాసన్…ఇప్పుడు సూపర్ హిట్ ‘భారతీయుడు’ సీక్వెల్ తో రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version