ఏపీలో ఈనెల 21 నుంచి కులగణన ప్రారంభం అవుతుందని సమాచార శాఖ మంత్రి చెల్లు బోయిన వేణు గోపాల్ కృష్ణ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి కుల గణన ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ఉండటం వల్లనే సర్వే ప్రక్రియ తొందరగా పూర్తి అవుతుందని తెలిపారు. క్యాబినెట్ నిర్ణయంతో బీసీ వర్గ వ్యక్తిగా చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.
రిషికొండపై ఏర్పాటు చేస్తున్నది ముఖ్యమంత్రి పర్యటన సమయంలో తాత్కాలిక విడిది అని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ తెలిపారు. రాజకీయ కారణాలతోనే కొంత మంది సుప్రీంకోర్టు వరకు వెళ్లారని.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అందుకే సుప్రీంకోర్టు పిటిషన్ ను తిరస్కరించిందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంటే.. ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని.. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.