తెలంగాణాలో ఎన్నికల సమయం కావడం వలన పార్టీలు అపోజిట్ పార్టీలపై విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. తెలంగాణాలో వస్తుందనుకున్న పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అట్టర్ ప్లాప్ అంటూ విమర్శించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి లక్ష కోట్లు కేసీఆర్ వృధాగా ఖర్చు చేయడమే కాకుండా, కేవలం కమిషన్ ల కోసమే ఈ ప్రాజెక్టును కట్టినట్లు కిషన్ రెడ్డి స్పష్టంగా తెలియచేసారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు కు సంబంధించిన ప్రభుత్వం సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ కూడా సరిగా లేవంటూ కిషన్ రెడ్డి తెలియచేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ను రి డిజైన్ చేయడం కోసమే కోట్లు దోచేశారు అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏకిపారేసారు కిషన్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టు లో కేసీఆర్ భారీ అవినీతి చేశారని దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టు లో ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయికి కేసీఆర్ ప్రజలకు సంధానం చెప్పాలని డిమాండ్ చేశారు.