ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోని ఇండియన్ యాక్టర్స్..!

-

రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఇద్దరూ కూడా ఒకరితో మరొకరు పోటీపడి నటించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. కేవలం ఇండియాలోనే కాకుండా వివిధ విదేశాలలో కూడా సినిమాను రిలీజ్ చేసి భారీ పాపులారిటీని దక్కించుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి ఆస్కార్ టార్గెట్గా ఈ సినిమాను విడుదల చేసినప్పటికీ కూడా ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ లో చోటు దక్కించుకోలేదు.

మరొకవైపు కన్నడ హీరో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంతారా. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాహుబలి కలెక్షన్ల రికార్డులను సైతం కొల్లగొట్టింది అనే వార్తలు వినిపించాయి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా కూడా ఆస్కార్ రేసులో నిలబడుతుందని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి అటు ఆర్ ఆర్ ఆర్, ఇటు కాంతారా రెండు కూడా పలు విభాగాలలో పోటీ పడబోతున్నాయి అనే వార్తలు కూడా వినిపించాయి.

ఇక ఎన్టీఆర్ కైతే ఏకంగా ఇంగ్లీష్ మ్యాగజైన్లో నామినేషన్ లిస్టులో ఉండబోతున్నాడు అంటూ లిస్టు రిలీజ్ చేసింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2023 ఆస్కార్ నామినేషన్ లిస్టు విడుదల చేయగా అందులో ఆర్.ఆర్.ఆర్ సినిమా నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మినహా , మరీ విభాగంలో కూడా ఈ సినిమా స్థానం దక్కించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే బెస్ట్ యాక్టర్స్ క్యాటగిరిలో అటు ఎన్టీఆర్ ఇటు రిషబ్ శెట్టి ఎవరూ కూడా చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news