మంచు మనోజ్ తప్పులు మీద తప్పులు చేస్తున్నారా..?

-

మంచు కుటుంబంలో మోస్ట్ అగ్రెసివ్ మెన్ గా పేరు సంపాదించుకున్నారు మంచు మనోజ్.. మొదటి నుంచి కాస్త దూకుడుగా ఉండే మనోజ్ రాను రాను మరింత యాంగ్రీ మ్యాన్ గా తయారవుతున్నాడు. చిన్న చిన్న విషయాలు కూడా బయట పెట్టుకోవడం వల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఆయన గ్రహించలేకపోతున్నాడు. సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా వివాదాలు ఉంటాయి.. అలా వివాదాలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. కానీ మనోజ్ మాత్రం తెలిసి చేస్తున్నాడో.. తెలియక చేస్తున్నాడో.. తెలియదు కానీ చిన్న చిన్న విషయాలను కూడా ముఖ్యంగా తమ కుటుంబం పరువు పోయేలా సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు అంటూ అభిమానులు సైతం ఆయనకు హితువు చేస్తున్నారు..

వాస్తవానికి మనోజ్ ఎప్పుడు కోపంలో ఏదో ఒకటి చేసేయడం.. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం.. మొదటి నుంచి ఉన్న అలవాటే .. సినిమాల ఎంపికలో పొరపాట్లు చేస్తే కేవలం కెరియర్ మాత్రమే పోతుంది.. కానీ జీవితంలో పొరపాట్లు చేస్తే కుటుంబం పరువు, భవిష్యత్తు, ఇన్నాళ్లుగా కాపాడుకున్న గౌరవం అన్నీ కూడా మంటగలిసిపోతాయి. వాస్తవానికి ఆయన సినిమాల విషయంలో ఎవరు జోక్యం చేసుకునే వారు కాదు.. అందుకే ఈరోజు ఒక్క సినిమా కూడా చేయలేని స్థితిలో చేరిపోయాడు. పెళ్లి విషయంలో ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు.

ప్రణతి రెడ్డిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అతని నిర్ణయాన్ని కుటుంబం కూడా స్వాగతించింది. కానీ చిన్న చిన్న వివాదాలు పెద్దవి కావడం. వరుసగా సినిమాలు పరాజయం పాలవడంతో.. ప్రణతి అమెరికాకు తనతో పాటు రమ్మని చెప్పినా.. వినకపోవడం వంటివి జరిగాయి. దాంతో కోపం పై ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. మరొకవైపు ఒక బిడ్డ తల్లిని కోడలుగా తెస్తానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అయినా కూడా మనోజ్ ని ఆపలేము అని అర్థం అయ్యాక పెళ్లికి కుటుంబం మొత్తం అతిధులుగా వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడేమో ఇలా చిన్నచిన్న గొడవలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి పరువు పోగొట్టుకుంటున్నాడు. అసలు మనోజ్ ఎందుకు ఇలా తప్పులు మీద తప్పులు చేస్తున్నారు అంటూ అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version