ప్రస్తుత కాలంలో.. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగి పోయింది. చీమ చిటుక్కుమన్నా… సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఇక సెలబ్రీటీల గురించి.. ఎలాంటి చిన్న వార్త వచ్చినా… వైరల్ గా మారుతోంది. వాళ్లు నిలుచున్నా.. పడుకున్నా వార్తే అవుతోంది. అయితే.. కొంత మంది.. సెలబ్రీటీలపై తప్పుడు వార్తలను కూడా రాసి.. సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు.
అయితే.. తాజాగా.. పోర్న్ స్టార్ మియా ఖలీఫా మృతి చెందినట్లు ఇటీవలే కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు సృష్టించాయి. అయితే.. ఆమె మరణ వార్త విన్న మియా ఖలీఫా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు మియా ఖలీఫానే ట్విట్టర్ లో స్వయంగా.. స్పందించింది. ఓ హస్య భరిత మీమ్ ను పోస్టు చేస్తూ.. దాని ద్వారా తానింకా బతికే ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. దీంతో పోర్న్ స్టార్ మియా ఖలీఫా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.