Radhe Shyam : రాధేశ్యామ్ డిజాస్టారా..? 7 రోజుల‌ క‌లెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

-

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, మోస్ట్ స‌క్సస్ ఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే క‌లిసి చేసిన రాధే శ్యామ్. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో ఈ నెల 11 వ తేదీన పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అయింది. కాగ ఈ సినిమా విడుద‌లై నిన్న‌టితో వారం రోజ‌లు కావాస్తుంది. కాగ ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో విడుద‌ల అయింది. కాగ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో కొంత వ‌ర‌కు విఫ‌లం అయింద‌ని సినీ విమ‌ర్శ‌కులు, అభిమానులు అంటున్నారు.

క‌లెక్షన్ల ప‌రంగా చూసినా.. ఈ సినిమా ఫ్యాన్స్ ను ఆక‌ట్టు కోలేద‌ని స్ప‌ష్టం అవుతుంది. మొద‌టి రెండు మూడు రోజులు కలెక్షన్లు భారీగానే ఉన్నా.. క్ర‌మంగా త‌గ్గుతు వ‌స్తున్నాయి. రోజు రోజు కు క‌లెక్షన్లు డ్రాప్ అవుతూ వ‌స్తున్నాయి. కానీ ఒక్క రోజు కూడా క‌లెక్షన్ ల‌లో గ్రోత్ క‌నిపించ‌లేదు. ఈ సినిమా క‌లెక్షన్ లు ఇలాగే కొన‌సాగితే.. భారీ డిజాస్ట‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు. కాగ గ‌త వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

మొద‌టి రోజు – రూ. 25.49 కోట్లు, రెండో రోజు – రూ. 12.32 కోట్లు, మూడో రోజు – రూ. 10.58 కోట్లు, నాలుగో రోజు – 2.11 కోట్లు, ఐదో రోజు – 1.14 కోట్లు, ఆరో రోజు – 63 ల‌క్షలు, ఏడో రోజు – 32 ల‌క్షలు గా ఉన్నాయి. మొత్తంగా 7 రోజుల్లో రూ. 52. 59 కోట్ల నెట్, గ్రాస్ గా రూ. 82 కోట్లు వ‌సూళ్లు అయ్యాయి. అలాగే క‌ర్నాట‌క లో రూ. 4.18 కోట్లు, త‌మిళ‌నాడు లో రూ. 75 ల‌క్షలు, హిందీలో రూ. 8.95 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.58 కోట్లు, ఓవ‌ర్సీస్ లో రూ. 11.13 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. దీంతో ఈ వారంలో రూ. 79.36 కోట్ల నెట్ గా గ్రాస్ గా రూ. 142.20 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి. కాగ ఈ సినిమా హిట్ రావాలంటే.. రూ. 204 కోట్లు రావాలి. అంటే.. మ‌రో రూ. 124.64 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టాలి. అయితే ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌యంలో ఇది క‌ష్టం అని చెప్ప‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version