ట్విట‌ర్ పోల్ : అది జ‌గ‌న్ వ్యూహ‌మే !

-

ఉత్త‌రాది పార్టీలు ఏవీ కూడా ద‌క్షిణాదిలో నిల‌దొక్కుకోవ‌డం లేదు.ఒక‌నాడు కాంగ్రెస్ ఆ విధంగా హ‌వా చూపిన‌ప్ప‌టికీ ప్రాంతీయ పార్టీల దెబ్బ‌కు ఇవాళ అస్స‌లు ఆచూకీ లేకుండా పోయింది.బీజేపీ కూడా ప‌ది లోపే అసెంబ్లీ స్థానాల‌ను గెలుచుకుని, తెలంగాణ రాష్ట్ర స‌మితితో పోరాడ లేక చతికిల‌ప‌డుతోంది. ఇదే విధంగా ఆంధ్రాలో కూడా బీజేపీ అస్స‌లు రాణించ‌లేక‌పోతోంది.ఈ ద‌శ‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల‌పైనా ఫోక‌స్ చేసింది. ఇప్ప‌టికిప్పుడు ఫ‌లితాలు రాక‌పోయినా ప్రాంతీయ పార్టీల హ‌వాకు
చెక్ పెట్ట‌డం అన్నది ఎలానో తెలుసుకునేందుకు రానున్న ఎన్నిక‌లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిల‌వ‌వ‌చ్చు.ఓ రిఫ‌రెన్స్ కోడ్ కావొచ్చు.మ‌రోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ రాక వెనుక ఏపీ సీఎం జ‌గ‌న్ ఉన్నార‌న్న అనుమానాలు కొన్ని టీడీపీ నుంచి వ‌స్తున్నాయి.

చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చుక్క‌లు చూపేందుకు సిద్ధం అవుతున్నారు వైసీపీ బాస్ జ‌గ‌న్. అందులోభాగంగానే ఆయ‌న వ్యూహాలు ఉంటున్నాయి.ముఖ్యంగా విప‌క్షాలు అన్నీ ఏకం అయితే జ‌గ‌న్ కు అధికారం మ‌ళ్లీ ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని తేలిపోయింది. దీంతో జ‌గ‌న్ త‌న‌కు చెందిన వారిని టీడీపీలోకి పంపేందుకు కూడా వ్యూహాలు ప‌న్నుతున్నారు.ఆ విధంగా ఆప‌రేష‌న్ జ‌గ‌న్ ను షురూ చేయ‌నున్నారు.ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్టీ కోవ‌ర్టు ఆప‌రేష‌న్ ను షురూ చేసింద‌ని కూడా తెలుస్తోంది. ఇదేవిధంగా టీడీపీ కూడా ఏపీ సెక్ర‌టేరియ‌ట్లో త‌న మ‌నుషుల ద్వారా విలువ‌యిన స‌మాచారం సేక‌రిస్తోంది.గ‌తంలో త‌న వ‌ద్ద ప‌నిచేసిన అధికారుల‌నే ఇందుకు వినియోగిస్తూ, సీఎంఓ ఇన్ఫోను తెలుసుకుంటున్నారు చంద్ర‌బాబు. ఇందుకు అత్యంత న‌మ్మ‌క‌స్తుల‌యిన అధికారుల‌నే వాడుకుంటున్నారు. ఈ ద‌శ‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్న‌ది రాష్ట్ర రాజ‌కీయాల్లో అడుగు పెడితే జ‌గ‌న్ ఏమౌతారు? ఆయ‌న‌కు అనుకూల రీతిలో ఏ విధంగా ఫ‌లితాలు వ‌స్తాయి అన్న‌ది చూద్దాం.

వాస్త‌వానికి ఢిల్లీలోనూ,పంజాబ్ లోనూ సాధించిన విజ‌యాల కార‌ణంగా కేజ్రీ వాల్ త‌న వేగం పెంచారు.ద‌క్షిణాది రాష్ట్రాల‌కూ ఆప్ ను మ‌రింత విస్తారం చేయాల‌ని సంకల్పించారు.అయితే త‌న‌కు ఎప్ప‌టి నుంచో స‌న్నిహితంగా ఉన్న జ‌గ‌న్ సాయం కూడా ఇందుకు అవ‌స‌రం అని భావిస్తున్నారు.ఆ రోజు టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌న్ ఎంత‌గా కృషి చేశారో,ఈ సారి వైసీపీ మ‌ళ్లీ అధికారం చేజిక్కుంచుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే రీతిలో కృషి చేయ‌నుంది.తెర‌వెనుక ఆమ్ ఆద్మీ పార్టీతో జ‌గ‌న్ స్నేహాస్తం ఉండ‌వ‌చ్చ‌ని టీడీపీ అనుమానిస్తోంది. ఎలానూ తామే గెలుస్తామ‌న్న ధీమా వ‌చ్చేసింది క‌నుక జ‌గ‌న్ అప్ర‌మ‌త్తం అయి ఇప్ప‌టికే ఎమ్మెల్యేలనూ,ఎంపీల‌నూ క్షేత్ర స్థాయిలో బాగా ప‌నిచేయాల‌ని ఆదేశించార‌ని అంటున్నారు.అంటే విప‌క్షాల ఐక్య‌త కార‌ణంగా వైసీపీ మ‌రింత పున‌రాలోచ‌న‌లో ప‌డింది అన్న‌ది ఓ వాస్త‌వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version