రాకేష్ మాస్టర్ మరణించడానికి కారణం అదేనా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరుపొందిన రాకేష్ మాస్టర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఈయన గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు పలు బుల్లితెర షో లపై సందడి చేస్తూ ఉండేవారు.. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు రకాల విషయాలను తెలియజేస్తూ ట్రెండీగా మారుతూ ఉండేవారు రాకేష్ మాస్టర్.. అయితే నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో మరణించిన ఈయన మరణానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

రాకేష్ మాస్టర్ గత వారం రోజుల క్రితమే సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నంకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడ షూటింగ్ ముగించుకొని హైదరాబాదుకి చేరుకున్న సమయంలో వడదెబ్బ బారిన పడ్డట్టుగా తెలుస్తోంది. దీంతో ఆదివారం రోజున రక్త విరోచనాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలో ఉండే గాంధీ ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. అయితే అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

రాకేష్ మాస్టర్ వైజాగ్ షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో అతిగా మద్యం సేవించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. కామెడీ సన్నివేశాలు షూటింగ్ చేస్తున్న సందర్భంగా రెండు రోజులపాటు దాదాపుగా 20 ఫుల్ బాటిల్ మద్యం తాగినట్లు సమాచారం. ఈ కారణంగానే రక్త విరోచనాలకు దారితీసి ఉండవచ్చని అనుమానాలు కూడా వినపడుతున్నాయి.. ఈ కారణంగానే రాకేష్ మాస్టర్ మరణించారని వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ రోజున బోరుబండలో రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు జరగబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version