చాలా మంది కేంద్రం అందించే స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. ఇలా స్కీముల్లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పేరు తో ఒక పథకాన్ని అందిస్తోంది కేంద్రం. దీన్ని ఎన్‌పీఎస్ అని అంటారు. ఇక ఈ స్కిం కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో చేరితే మంచిగా లాభాన్ని పొందవచ్చు. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్ లో ఇది కూడా ఒకటి.
ఈ స్కీమ్ లో 18 నుంచి 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు చేరవచ్చు. రిటైర్మెంట్ తర్వాత భారీ మొత్తం ఈ స్కీము తో పొందవచ్చు. అలానే ప్రతి నెలా పెన్షన్ కూడా వస్తుంది. 60 ఏళ్ల తర్వాతనే ఈ బెనిఫిట్స్ మీకు వస్తాయి. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా ఈ స్కీము తో పొందవచ్చు. ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. 25 ఏళ్ల నుంచే ఎన్‌పీఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు ఏకంగా రూ. 2.94 లక్షలు మీకు వస్తాయి. నెలకు రూ. 12,500 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీ వయసు ఆధారంగా మీకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మారతాయి.
నెలకు రూ. 3 వేలు పెట్టాలని చూస్తుంటే 26 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాలి. మొత్తంగా రూ. 9.36 లక్షలు ఇన్వెస్ట్ చేసారంటే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 44 లక్షలు లభిస్తాయి. వార్షిక రాబడి 10 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం. మీకు రూ. 44 లక్షలు వస్తాయి. 40 శాతం మొత్తంతో యాన్యుటీ ప్లాన్ కొనాలి. వచ్చిన రూ.44 లక్షల మొత్తంలో రూ. 17.8 లక్షలు పెట్టి యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి. మిగతా రూ. 26.8 లక్షలు మీరు విత్‌డ్రా చెయ్యచ్చు. యాన్యుటీ ప్లాన్ ద్వారా ప్రతి నెలా పెన్షన్ ని మీరు తీసుకోవచ్చు. యాన్యుటీ రేటు 7 శాతంగా పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్రతి నెలా రూ. 10,435 వరకు పెన్షన్ ని తీసుకోచ్చు. ఒకేసారి చేతికి రూ. 26 లక్షలకు పైగా వస్తాయి. ప్రతి నెలా రూ. 10 వేలకు పైగా పెన్షన్ ని పొందవచ్చు.