అడవి శేషు 8 బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా..?

-

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన అడవి శేష్ తాజాగా హిట్ -2 సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. హిట్ -2 కంటే ముందు మేజర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నట్లుగా తెలుస్తోంది. అడవి శేషు తన సినిమాలలో ఎప్పుడూ విభిన్నమైన కథ ను ఎంచుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. హిట్ -2 చిత్రానికి నిర్మాతగా నాని వ్యవహరించడం జరిగింది.

హిట్ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా అడవి శేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. మేజర్ సినిమా విడుదలై మంచి విజయం అందుకున్న తర్వాత బాలీవుడ్ నుంచి వరుసగా 8 ప్రాజెక్టులు తన వద్దకు వచ్చాయని అయితే వాటన్నిటిని రిజెక్ట్ చేసినట్లుగా తెలియజేశారు. తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కమిట్ అయిన సినిమాలు ఉండటం వల్ల బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేయడానికి నిరాకరించినట్లుగా తెలియజేశారు. అంతేకాకుండా హిట్ -2 సినిమాతో పాటు తన నుంచి రాబోయే చిత్రాలు అన్నీ కూడా బాలీవుడ్ లో కూడా విడుదల చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

అలాగే హిట్ -3 సినిమాలో కూడా అడవి శేషు కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అడవి శేషు నటించిన గతంలో చిత్రం గూడచారి ఈ సినిమాకి సీక్వెల్ లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకేసారి 8 సినిమాలు బాలీవుడ్ చిత్రాలను రిజెక్ట్ చేయడంతో అభిమానులకు ఈ విషయం తెలియగానే..ఒకసారి షాక్ కు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version