రాజమౌళి రికార్డులను చెరిపివేసే డైరెక్టరే లేరా..?

-

డైరెక్టర్ రాజమౌళి ఏదైనా సినిమా చేశారంటే ఎంతో అద్భుతంగా చేస్తారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుచేత ఆయనను దర్శకధీరుడు అని పిలుస్తూ ఉంటారు. రాజమౌళి ( Rajamouli ) 1973 అక్టోబర్ 10వ తేదీన కర్ణాటక రాయచూరు లో జన్మించారు. రాజమౌళి చేసే ప్రతి సినిమాకి కూడా ప్రాణం పెట్టి పని చేస్తాడు అందుకే ఆయన సినిమాలు అంతటి విజయాలను అందుకుంటాయి. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా ( Pan India) లెవెల్ లో పేరు సంపాదించాడు రాజమౌళి. ఇక తాజాగా విడుదలైన RRR చిత్రం తో ఇతర భాషా ప్రాంతాలలో సైతం అభిమానులను సంపాదించుకున్నాడు రాజమౌళి. అయితే రాజమౌళి ఇప్పటి వరకు సాధించిన అత్యధిక కలెక్షన్లు గురించి చూద్దాం.

1). స్టూడెంట్ నెంబర్:ఈ చిత్రంతో రాజమౌళి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాని రాజమౌళి ఎన్టీఆర్ తో కలిసి రూ.3 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.. ఏకంగా రూ.11 కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించింది.

2). సింహాద్రి:మరొకసారి ఎన్టీఆర్ తోనే సింహాద్రి సినిమా తీయగా రూ.8 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. 26 కోట్ల రూపాయలు లాభం.

3). సై:నితిన్ తో రాజమౌళి ఈ సినిమాని రూ.5 కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కించ గా రూ.10 కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించింది.

4). చత్రపతి:ప్రభాస్ తో కలిసి రాజమౌళి రూ.10 కోట్ల రూపాయలతో తెరకెక్కించ గా.. రూ.21 కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించింది.

5). విక్రమార్కుడు:రవితేజతో రూ.11 కోట్ల రూపాయలతో ఈ సినిమాని తెరకెక్కించగా.. రూ.20 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

6). యమదొంగ:మరొకసారి ఎన్టీఆర్ తో రూ.18 కోట్ల రూపాయలతో తీయగా రూ.29 కోట్ల రూపాయలు కలెక్షన్లను సాధించింది.

7). మగధీర:రామ్ చరణ్ తో రాజమౌళి రూ.44 కోట్లతో తెరకెక్కించ గా.. రూ.151 కోట్ల రూపాయలు రాబట్టింది.

8). మర్యాద రామన్న:సునీల్ తో రాజమౌళి రూ.14 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కించ గా.. రూ.29 కోట్ల రూపాయలను రాబట్టింది.

9). ఈగ:నాని తో రాజమౌళి రూ.35 కోట్ల రూపాయలతో తెరకెక్కించ గా. రూ.43 కోట్ల రూపాయలను రాబట్టింది.

10). బాహుబలి-1:రానా, ప్రభాస్ తో కలిసి ఈ సినిమాని రూ.136 కోట్లతో తెరకెక్కించగా.. రూ.602 కోట్ల రూపాయలను రాబట్టింది.

11). బాహుబలి-2:రానా ప్రభాస్ తో కలిసి బాహుబలి-2 ని రూ.250 కోట్లతో తెరకెక్కించగా.. రూ.1800 కోట్ల రూపాయలను ఈ చిత్రం భారత దేశంలోనే అత్యధికంగా కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది.

12).RRR:ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలసి రూ.550 కోట్లతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకు రూ.1120.11 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా సమాచారం. ఇప్పటివరకు రాజమౌళికి ఫ్లాప్ అనే సినిమానే రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version