ఆ పదం వాడినందుకు విశ్వక్సేన్ ను టీవీ9 యాంకర్ చెప్పుతోకొట్టాల్సింది: దానం నాగేందర్

-

హీరో విశ్వక్ సేన్ వ్యవహారం పొలిటికల్ రంగు పులుముకుంది. తాజాగా విశ్వక్ సేన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తన కొత్త సినిమా ‘ అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. పబ్లిక్ గా ఈ ఫ్రాంక్ చేయడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. ఈ వ్యవహారంపై టీవీ 9లో డిబెట్ నడుస్తుండగా…యాంకర్ దేవీ నాగవల్లి, విశ్వక్ సేన్ ను డిప్ ప్రెస్ డ్ పర్సన్ అని అన్నారు. దీంతో విశ్వక్ సేన్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  F***  అనే పదాన్ని వాడటం వివాదానికి దారి తీసింది. దీంతో దేవీ నాగవల్లి విశ్వక్ సేస్ ను తన స్టూడియో నుంచి వెళ్లి పోవాల్సిందిగా గెటవుట్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన తరవాత విశ్వక్ సేన్ టీవీ9కి క్షమాపణలు చెప్పారు. 

అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం ్యక్తం చేశారు. మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తించిన విశ్వక్ సేన్ సినిమాలను అడ్డుకుంటాం అని అన్నారు .విశ్వక్ సేన్ ఆ పదాన్ని వాడటంపై టీవీ 9 యాంకర్ చెప్పుతో కోట్టాల్పిందన్నానరు. విశ్వక్ సేన్ ను హీరోగా గుర్తించడం లేదని దానం అన్నారు. తన కుటుంబ సభ్యులతో విశ్వక్ సేన్ ఇలాగే వ్యవహరిస్తారా..? అని ప్రశ్నించారు. విశ్వక్ సేన్ ను చెప్పుతో కొట్టేందుకు మహిళా సంఘాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ రోడ్లపై చిల్లర వేశాలు వేసినందుకు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version