‘RRR’ తర్వాత ఎన్టీఆర్‌ ప్లాన్‌ ఇదేనా?

-

‘RRR‌’తో తమ ప్రయాణాన్ని ముగించుకుని.. తదుపరి కొత్త చిత్రాల కోసం సిద్ధమవుతున్నారు కథానాయకులు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌. చరణ్‌ ఇప్పటికే శంకర్‌ సినిమాని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తారక్‌ తన కొత్త ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘NTR30’గా పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించనున్నారు.

 

ఈ సినిమా అక్టోబరు తొలి వారంలో లాంఛనంగా మొదలు కానుందని సమాచారం. ‘జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ తర్వాత తారక్, కొరటాల కలయిక నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. పాన్‌ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. కథానాయికగా అలియా భట్‌ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్‌ నీల్‌తో ఓ చిత్రం చేయనున్నారు ఎన్టీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version