కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో రత్నసీత తెచ్చిన బ్యాగ్ మోనిత ఇచ్చిందని చెప్పగానే కార్తీక్ వాళ్లు షాక్ కి గురవతారు. రత్నసీత సారీ సార్..ఎంత చెప్పినా ఆవిడ వినలేదు అని బ్యాగ్ అక్కడే పెట్టి వెళ్లిపోతుంది. కార్తీక్ ఆ బ్యాగ్ ని తీక్షణంగా చూస్తాడు. ఏమై ఉంటుంది అని ఆనంద్ రావు అంటాడు. చూడు దీప అని సౌందర్య చెప్తుంది. దీప తీసి చూస్తుంది. చిన్నపిల్లల వాల్ పోస్టర్లు ఉంటాయి. ఒక లెటర్ కూడా ఉంటుంది. దీప తీసి కార్తీక్ కు ఇస్తుంది. లెటర్ సారాంశం.. మనకు పుట్టబోయే బాబు ఇలానే ఉంటాడు, అచ్చం నీలాగే, ఈ ఫుటోలన్నీ నీ బెడ్ రూంలో అంటిస్తే నేను చాలా సంతోష పడతా. పుట్టబోయే బిడ్డకు పేరు కూడా పెట్టేశాను. ఆనంద్ మీ నాన్నగారి పేరే. నేను బయటకొచ్చి నిన్ను సొంతం చేసుకుంటాను. ఇట్లు నీ సహధర్మచారణి2. ఆ లెటర్ చదివిన కార్తీక్ దాన్ని చింపి పారేస్తాడు. నేను బయపడిందే జరగబోతుందా అని సౌందర్య అంటుంది. జరగబోయేదాని గురించి ఇప్పుడే బయటపడ్డం ఎందుకు అని ఆనంద్ రావు అంటాడు. ఏం జరుగుతుంది మమ్మీ, ఏమీ జరగదు, నాకు దీపకు ఉన్నంత జాలీ, సానుభూతి ఏమీ లేవ్, ఉత్తరం రాసినట్లు తన తలరాతను తనే రాసుకోలేదు కదా అని కార్తీక్ అంటాడు. ఇంతలో ఈ హిమా, శౌర్యలు వచ్చి ఆ పోస్టర్లు చూసి బాగున్నాయే ఎవరు తెచ్చారు అని అడుగుతారు. దీప బాబ్బై తెచ్చాడు దీపుగాడి కోసం అంటుంది. వాళ్లు నవ్వి పోస్టర్లతో దీపుగాడు ఎలా ఆడుకుంటాడు అని వెళ్లిపోతారు. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.
అడ్రస్ కూడా కార్తీక్ ఇంటి అడ్రస్ ఇస్తుంది మోనిత. రోషిణి కోపంతో డోంట్ ఇరిటేట్ మీ మిస్ మోనిత అంటుంది. మిస్ మోనిత కాదు మిస్ స్ మోనిత కార్తీక్ అనండి అంటుంది. నా భర్తతోనే ఉండాలని నా పేరు పక్కన తన పేరు పెట్టుకున్నాను. నేనెం మెంటల్ బ్యాలెన్స్ తప్పలేదు అంటుంది. తీసుకెళ్లు అని రోషిణి అంటుంది. మోనిత కానిస్టేబుల్ కి నాపై మర్డర్ కేసు, చీటింగ్ కేసు, అటెంప్టూ మర్డర్ కేసు ఇలా తను చేసిన నేరాలన్నింటిని తనే చెప్పి కేసు పెట్టమని..నిజానికి నేను చేసింది నేరం కాదు త్యాగం అంటుంది.రోషిణి..నీ లాంటి తేడా క్రిమినల్స్ ని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు మోనిత అనుకుంటుంది.
ఇటుపక్క ఆ పిల్లల ఫొటోలను చూసిన కార్తీక్..పోలీసులకు లొంగిపోయి కూడా ఇలా వెంటాడడం మానలేదు చూశారా అని అంటాడు. సౌందర్య కూడా నేను రాత్రే మీ నాన్నతో అన్నాను..పోలీసులతో వెళ్తూ..తిరిగొచ్చాక మళ్లీ వస్తాను అని వెళ్లింది అంటే ఇంకా మనల్ని వెంటాట్టం మానదు అని అర్థం. అది చచ్చేదాక మారదు రా అంటుంది సౌందర్య. మృగం చచ్చేదాక మారదు. మోనిత కూడా అంతే అని కార్తీక్ అంటాడు. దీప మాత్రం..ఇంకా ఇలాంటివి అన్నీ చేస్తూనే ఉంటుంది. మనం అన్నింటికి భయపడకూడదు. ఒక పిచ్చిది, ఉన్మాది అంటుంది. అదేదో వాగితే దాన్ని మనం లెక్కలోకి తీసుకోవటం ఎందుకు అంటుంది. నీకేమాత్రం టెన్షన్ గా లేదా దీప అని సౌందర్య అడుగుతుంది. లేదు అని దీప చెప్తుంది. ఎందుకుంటది, తమరికి మానవత్వం ఎక్కువ కదా అని కార్తీక్ అంటాడు. నేను మానవత్వమే చూపించే ఉంటే మోనితను కోర్టుకు తీసుకువచ్చేదాన్ని కాదు డాక్టర్ బాబు, మీరెందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారో తెలియటం లేదు. జాలీ, సానుభూతి, సహనం ఇవన్నీ నేనెప్పటికి మోనితమీద చూపించను. పదేళ్లఎడబాటుకు కారణమైంది అది నేనెప్పటికి మర్చిపోను అని దీప అంటుంది. అది పరోక్షంగా కూడా మీ ఇద్దరిని దూరం చేయాలనే ఇలాంటి చిల్లర పనులు చేస్తుంది. ముందు మీరు అది గుర్తించండి… అని సౌందర్య అంటుంది.
మోనిత గురించి మీకు తెలియదా… ప్రశాంతంగా ఒక్కరోజు కూడా ఉండనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడే వెళ్లి పోలీస్ స్టేషన్లో దాన్ని చంపేసిరావలన్నంత కసి పుడుతుంది కార్తీక్ అంటాడు..మోనితను బాగా తిట్టి..అది చేసిన పాపాలకు యావజ్జీవ శిక్ష పడితే తప్ప నాకు ప్రశాంతంగా ఉండదు అంటాడు.. ఎందుకు ఇంత సీరియస్ గా డిస్క్స్ చేసుకుంటున్నారు, మోనిత లీగల్ గా ఏం చేయలేదు వదిలేయండర్రా అని ఆనందర్ రావు అంటాడు. ఎలా వదిలేయాలి అండి.. కాస్త అవకాశం దొరికినా మోనిత బిడ్డను పట్టుకుని ఇక్కడికే వస్తుంది. మీరు రానిస్తారా అని సౌందర్య కోపంగా అడిగి వెళ్లిపోతుంది.
ఇంకోవైపు హిమ, శౌర్య వాళ్లు ఛెస్ ఆడుకుంటూ ఉంటారు. ఆదిత్యను చూసి నవ్వుతారు. ఏమైందే అని అడుగుతాడు. ఏం లేదని నవ్వుతూనే ఉంటారు. ఆదిత్య శౌర్యను మీకెందుకే నన్ను చూసి నవ్వొచ్చింది అని అడుగుతాడు. దీపు గాడికి టాయిస్ తేకుండా అన్నన్ని పోస్టర్లు తెచ్చావా, వాడు పోస్టర్లతో ఏం ఆడుకుంటాడు చించిపడేస్తాడు అని శౌర్య నవ్వుకుంటూ చెప్తుంది. ఆదిత్యకు ఏం అర్థంకాదు. పోస్టర్లా, పోస్టర్లంటీ.. ఏం మాట్లాడుతున్నారు. నేను పోస్టర్లు తీసుకురాలేదు అంటాడు. ఎవరు తెచ్చారు అని అడుగుతాడు. ఏం లేదులే బాభ్బై అని చెప్పి వెళ్లిపోతారు. అమ్మ మళ్లీ అబద్ధమే చెప్పిందిని శౌర్య బాధపడుతుంది.
పోలీస్ స్టేషన్ లో ఉన్న మోనిత దగ్గరకు రత్నసీత వెళ్తుంది. తనని చూసిన మోనిత కార్తీక్ గురించి అడుగుతుంది. జరిగింది అంతా పూసగుచ్చినట్లు చెప్తుంది రత్నసీత. సరే ఇంక నువ్వెళ్లు అంటుంది మోనిత. మేడమ్ ఇంకొక గంటలో మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తామని మోడమ్ చెప్పమన్నారు అంటుంది రత్నసీత. కార్తీక్ కూడా వస్తున్నాడా అని అడుగుతుంది మోనిత. అవును అంటుంది రత్నసీత. మోనిత ఆనందంగా కార్తీక్ ను చూడొచ్చు అనుకుంటుంది.
కార్తీక్ కి కోర్టుకు రావాలని ఫోన్ వస్తుంది. ఆ విషయం దీపకు చెప్తాడు. వాళ్లు మాట్లాడుకునే సమయంలో ఆదిత్య, శ్రావ్య వాళ్లు వచ్చి..ఎక్కడికి వదినా వెళ్లక తప్పదుకదా అంటున్నావ్ అని ఆదిత్య అడుగుతాడు. కోర్టుకి, మోనితను హజరుపరుస్తున్నారంట, సాక్ష్యం చెప్పాలికదా అంటుంది దీప. ఇదే మంచి టైం ఉన్నవి లేనివి కల్పించి చెప్పేయండి, లైఫ్ లాంగ్ అది జైల్లోనే మగ్గిపోవాలి అంటుంది శ్రావ్య. కల్పించి చెప్పక్కర్లేదు చేసినవే చాలా ఉన్నాయ్ అన్ని గుర్తుపెట్టుకుని చెప్తే చాలు అంటాడు కార్తీక్. అంటే మనం చెప్పేదానిబట్టే శిక్ష కరార్ అవుతుందా అని దీప అడుగుతుంది.
అవును, మోనితకు శిక్ష పడితే మనం పండగ చేసుకుందాం అని ఆదిత్య, శౌర్యలు అంటారు. దీప వాలకం చూస్తే..సాక్ష్యం చెప్పేలా లేదు మరి..నన్ను మానసికంగా ఎంత క్షోభకు గురిచేసిదంటే నేనే నా కుటుంబం ఏమైపోతుందో అని పిరికివాడిలా మారిపోయా అంటాడు కార్తీక్.. కోర్టుకు వెళ్లడానికి సిద్ధపడతారు. ఇంతలో శౌర్య వచ్చి అబద్దం ఎందుకు చెప్పావ్, ఆ పిల్లల పోస్టర్లు బాభ్బై తెచ్చాడు అన్నావ్, బాభ్బైని అడిగితే నాకేం తెలియదు అన్నాడు. నువ్వు మారావా అమ్మా అని.. నాన్నా నువ్వు అమ్మను నమ్మకు అని కోపంగా చెప్పి వెళ్తుంది. ఆదిత్య పోస్టర్ల గురించి అడుగుతాడు, శ్రావ్య నేను చెప్తాను కదా అని తీసుకెళ్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.