సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాల వ్యవహారంలో కొత్త ట్విస్టులు నమోదవుతున్నాయి. ఇవాళ మంచు విష్ణు విదేశాల నుంచి జల్పల్లికి చేరుకున్న కొద్ది సేపట్లోనే మంచు మనోజ్ తన భార్యాబిడ్డలతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో అసలు మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణం ఏంటనేది వారి పనిపనిషి బయటపెట్టారు. ఇందుకు సంబంధిచిన వీడియో వైరల్ అవుతోంది.
మహిళా పనిమనిషి మాట్లాడుతూ.. ‘రెండు రోజుల క్రితం మోహన్ బాబు సిబ్బందిలోని ప్రసాద్ అనే వ్యక్తిని మంచు మనోజ్ బెల్ట్స్ కొట్టేందుకు వచ్చారు. తన స్టాఫ్ ని కొట్టవద్దంటూ మనోజన్నను మోహన్ బాబు నెట్టేశారు. దీంతో మోహన్ బాబుపై మనోజ్ చేయిచేసుకున్నారు. ప్రసాద్ అనే వ్యక్తి సార్ వద్ద నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. ఈ గొడవలో నాకు తెలిసి దెబ్బలు తగలలేదు. కేవలం నెట్టేసుకున్నారంతే. అయితే వీరికి పాతగొడవలున్నాయి. మంచు విష్ణు, మంచు మనోజ్క మధ్య మనస్పర్థలు కూడా ఉన్నాయి. మౌనిక ను మనోజ్ పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదు. మౌనిక మొదటి భర్తకు పుట్టిన కుమారుడు ప్రస్తుతం మనోజ్ -మౌనికలతోనే ఉంటున్నాడు. ఈ విషయంలో మొదటి నుంచి మంచు కుటుంబానికి ఈ వ్యవహారం ఇష్టం లేదు. ప్రసాద్ అనే వ్యక్తి కారణంగా మోహన్ బాబుపై మనోజ్ చేయి చేసుకున్నారని తెలిపింది.