మంచు ఫ్యామిలీ లో హైడ్రామా కొనసాగుతోంది. తనకు న్యాయం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలను రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయానికి వచ్చారు. తనకు న్యాయం చేయాలని డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను డీజీపీకి సమర్పించారు. అంతేకాదు.. ఫిర్యాదులో మనోజ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. డిసెంబర్ 08న పది మంది వ్యక్తులు తనపై బెదిరింపులకు దిగారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ఇంట్లోకి వచ్చి తననే ఇంట్లో ఉండొద్దని బెదిరింపులకు గురి చేశారని వెల్లడించారు. తాను షూటింగ్ కి వెల్లి ఉంటానని భావించి ఇంట్లోకి చొరబడ్డారని తెలిపారు. నా భార్యను పిల్లలను చంపేస్తానని బెదిరింపులకు దిగారని కంప్లైట్ లో మనోజ్ పేర్కొన్నారు. ఇదిలా ఇప్పటికే మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు పై.. మోహన్ బాబు ఫిర్యాదు ఆధారంగా మనోజ్ పై కేసులు నమోదు అయ్యాయి. తన రక్షణ కోసం గన్ మేన్లను కేటాయించాలని డీజీపీని కోరారు మంచు మనోజ్.