‘జాను’ రివ్యూ

-

‘జాను’ రివ్యూ :-

నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్ తదితరులు

దర్శకత్వం: సి ప్రేమ్ కుమార్

నిర్మాత: దిల్ రాజు

సంగీతం: గోవింద్ వసంత

విడుదల తేదీ: ఫిబ్రవరి 7, 2020

ఇంట్రడక్షన్:

తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘96’ సినిమా తెలుగులో ‘జాను’ గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో సమంత మరియు శర్వానంద్ జంటగా నటించారు. తమిళ వర్షన్ తెరకెక్కించిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లోనే తెలుగులో ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాకుండా తమిళ సినిమాకు సంగీతం అందించిన గోవింద వసంత.. తెలుగుకు కూడా సంగీతం సమకూర్చారు. టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. 

 

స్టోరీ నేపథ్యం:-

స్కూల్ వయసులోనే కె. రామచంద్ర (శర్వానంద్ ) జాను (సమంత) ప్రేమలో పడతాడు. చిన్న వయసులోనే పుట్టిన ఈ ప్రేమ క్రమక్రమంగా పెరిగి స్కూల్ నుండి విడిపోయిన గాని వాళ్ళిద్దరి హృదయాలు మారకపోవడం సినిమా స్టోరీ. దీంతో సినిమాలో తెలిసీ తెలియని వయసులో పెరిగిన ప్రేమను పెరిగిన వయసుతో అదే ప్రేమ పెరగటంతో శర్వానంద్ ఎలాగా సమంత ని కలవడం జరిగింది…స్కూల్ నుండి విడిపోయిన తర్వాత ఏం జరిగింది ఇంతకీ సమంత శర్వానంద్ ని ప్రేమిస్తుందా లేదా అనేది సినిమా స్టోరీ. కథ వింటే రొటీన్ స్టోరీ గా అనిపించినా గాని సినిమాలో మంచి సోల్ ఉంది. సినిమా స్టార్టింగ్ నుండి చివరి దాకా సినిమా చూసిన ప్రేక్షకులను స్కూల్ వయసులోకి తీసుకెళ్ళి పోతాడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్. 

విశ్లేషణ:

ప్రతి ఒక్కరి జీవితంలో పాఠశాల చదువుతున్న సమయంలో కచ్చితంగా ఈ స్టోరీ అనుభవం గుండా వెళ్లే ఉండటంతో సినిమా చూడటం తోనే మొదటిసారి కనెక్ట్ అయిపోతుంది. తమిళంలో తెరకెక్కిన ‘96’ సినిమా చాలా స్లో గా ఉంటుంది. అదేవిధంగా మంచి ఫీల్ ఉంటుంది. దీంతో అదే తరహాలో తమిళంలోనూ తెరకెక్కించిన ప్రేమ్ కుమార్…తెలుగులో కూడా మిస్ అవ్వకుండా ‘జాను’ సినిమాని సూపర్ గా తెరకెక్కించాడు. లవ్ స్టోరీ ఇష్టపడే మరియు క్లాసిక్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ‘జాను’ ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా మ్యాజిక్‌ను మాత్రం కచ్చితంగా సినిమా హాల్లో ఆడియన్స్ గా అనుభవించడం గ్యారెంటీ. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ ఫ్లాష్‌బ్యాక్‌లో స్కూల్ ఎపిసోడ్. స్కూల్ నేపథ్యంలో సినిమాలో జానకి, రామ్ పాత్రల ఎంపికలోనే డైరెక్టర్ ప్రేమ్ కుమార్ సగం విజయం సాధించాడు. తమిళంలో ’96’ సినిమాలో చేసిన స్కూల్ నేపథ్యంలో హీరో హీరోయిన్ల క్యారెక్టర్లను వారిచేత తెలుగులో కూడా చేయించడం జరిగింది. దీంతో తమిళంలో మాదిరిగానే తెలుగులో కూడా స్కూల్ లో వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వెండితెరపై పండాయి. సినిమా మొత్తానికే హైలైట్ శర్వానంద్-సమంత జంటల యాక్టింగ్. ఇద్దరికిద్దరూ స్టోరీ లో ఉన్న ఫీల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ చేశారు.

ఓవరాల్ గా:

తమిళంలో విజయ్ సేతుపతి మరియు త్రిష జంటగా నటించిన ఈ సినిమాకి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో అదే రెస్పాన్స్ శర్వానంద్ – సమంత జంటలకు రావడం జరిగింది. సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్‌తో సినిమా స్టార్ట్ అయ్యి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించే విధంగా అద్భుతంగా చిత్రీకరించాడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్. ఓవరాల్ గా ‘జాను’ సూపర్ డూపర్ హిట్ అవుతుందా లేక యావరేజ్ గా నడుస్తుందా అనేది ప్రేక్షకులు డిసైడ్ చెయ్యాలి. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా వేదన – ప్రేమ ల మిళితం గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి స్టోరీ ఎలా తీసుకుంటారు అనేది చూడాలి. తమిళం లో పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా OTT ప్లాట్ ఫార్మ్ లో బాగా ఫేమస్ అయ్యింది .. అందుకే దిల్ రాజు దీని మీద ఆసక్తి చూపించారు. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రాన్ని యూత్ ఎక్కువగా కనక్ట్ అయితేనే హిట్ అయ్యే అవకాశం ఉంది. 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version