జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. వర్షిణి రీప్లేస్ అనసూయ

-

బుల్లితెర మీద కామెడీ కితకితలు పెడుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురు, శుక్రవారాలు వచ్చాయంటే టివిలకు అతుక్కుపోయేలా ఈ షో చేసింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ రెండు రోజులు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. కామెడీతో పాటుగా అనసూయ, రష్మిల అందాల విందు కూడా ఈ షో ఇంతగా హిట్ అయ్యేందుకు ఓ కారణమయ్యాయి.

యాంకర్ గా అనసూయ హాట్ అందాలు బుల్లితెర ఆడియెన్స్ ను వెర్రివాళ్లను చేస్తాయంటే నమ్మాల్సిందే. అనసూయ కొద్దిపాటి గ్యాప్ ఇవ్వడంతో ఆమె ప్లేస్ లో వచ్చిన రష్మి సెటిలైపోయింది. ఇక ఇప్పుడు సేమ్ టూ సేమ్ అనసూయ ప్లేస్ లో ఓ రెండు ఎపిసోడ్స్ కోసం వర్షిణిని తీసుకొచ్చారు. ఢీ 10లో కంటెస్టంట్స్ టీం లీడర్ గా సుధీర్ తో కలిసి చేసిన వర్షిణి ఇప్పుడు ఒకటి రెండు సోలోగా షోస్ మొదలు పెట్టింది.

వరుస సినిమా ఆఫర్స్ తో బిజీగా ఉండటం వల్ల అనసూయ జబర్దస్త్ షూటింగ్ రావడం వీలు కుదరదని చెప్పినట్టుంది. అందుకే రెండు ఎపిసోడ్స్ కు వర్షిణి యాంకర్ గా వచ్చింది. మరి ఈ అమ్మడు ఎలా తన యాంకరింగ్ తో అలరిస్తుందో చూడాలి. రష్మిలానే వచ్చిన అవకాశాన్ని వాడుకుంటుందా లేక రెండు వారాలు చేసి వెళ్లిపోతుందా అన్నది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version