చిరంజీవి సినిమా కంటే బాలయ్య సినిమా బాగా తీశారు : నిర్మాత నాగవంశీ

-

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ కొల్లి బాబీ(రవీంద్ర)  తెరకెక్కిస్తున్న మూవీ డాకు మహారాజ్. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై నిర్మాత నాగవంశీ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దర్శకుడు బాబీ తీసిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య కంటే కూడా బాలయ్య మూవీని ఇంకా బెస్ట్ గా తీయడం పెద్ద టాస్క్ అని రిపోర్టర్లు ప్రశ్నించారు. దీనికి నాగవంశీ స్పందిస్తూ.. చిరు ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు. చిరంజీవి గారి సినిమా కంటే బాలకృష్ణ సినిమాను బాగా తీశారు డైరెక్టర్ బాబీ అని చెప్పారు. 

జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలయ్యను సరికొత్త లుక్ లో చూడబోతారు. లెజెండ్, అఖండ గురించి ఎలా చెప్పుకుంటారో డాకు మహారాజ్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారని తెలిపారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ లేదా మంగళగిరిలో నిర్వహించాలనుకుంటున్నాం. జనవరి 02న హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ చేయానుకుంటున్నాం. రెండు రోజులకు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి.. అక్కడ ఓ పాటను విడుదల చేయనున్నాం. జనవరి 08న ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version