ఓటీటీలోకి జాన్వీ కపూర్‌ స్పోర్ట్స్‌ డ్రామా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. డిఫరెంట్ జానర్స్ లో చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తన అందంతో, అభినయంతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుంటూ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకుపైగా సినిమాలున్నాయి.

ఇక తాజాగా ఈ భామ నటించిన సినిమా మిస్టర్ అండర్ మిసెస్ మాహి. రాజ్‌కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ జంటగా శరణ్‌ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్‌ డ్రామా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా అందులో జాన్వీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదల కానుంది. జులై 26వ తేదీ నుంచి ప్రసారం అవుతోంది. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌, రాజేశ్‌ శర్మ, కుముంద్‌ మిశ్రా తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ వీకెండ్ లో మీరు ఎంజాయ్ చేసేందుకు ఈ మూవీ చూసేయండి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version