ఉగ్రవాదులను భారత సైన్యం అణిచివేస్తుంది.. పాకిస్థాన్ కు మోదీ వార్నింగ్

-

సరిహద్దుల్లో ఉగ్రవాదుల అరాచక చర్యలను భారత సైన్యం దీటుగా తిప్పికొడుతుందని, ఉగ్రవాదాన్ని సమూలంగా అణిచివేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కార్గిల్‌ 25వ విజయ దివస్‌ను పురస్కరించుకుని లద్దాఖ్‌ వెళ్లిన మోదీ.. ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..  దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని మోదీ అన్నారు.  పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి హెచ్చరించారు. గతంలో పాకిస్థాన్‌ పాల్పడిన వికృత ప్రయత్నాలు విఫలమైనా.. చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు సరికదా.. ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని అన్నారు. కార్గిల్‌ యుద్ధానికి లద్దాఖ్‌ సాక్షిగా నిలుస్తుందని.. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్‌ దివస్‌ జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version