తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తాజాగా రాజకీయంగా కూడా జనసేన పార్టీని పెట్టి ప్రజల ముక్కువ పొందాలని పోరాటాలు చేస్తున్నారు ఇక పవన్ వ్యక్తిగత విషయా నికి వస్తే తను మూడు వివాహాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదే. మొదట వైజాగ్ చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. ఈమె కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు.
ఇక ఆ తర్వాత బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రేణు దేశాయ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు కానీ ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఆమెను వివాహం చేసుకున్నారు కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే వీరిద్దరూ విడిపోవడం జరిగింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో రష్యన్ మోడల్ అయినా ఆన్నా లేజినోవో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి వివాహం చేసుకున్నారు.