టాలీవుడ్ లో జాన్వీ కపూర్ క్రేజ్.. రామాయణంలో సీతగా ఛాన్స్.. చెర్రీ మూవీలోనూ ఆఫర్

-

బాలీవుడ్‌ డైరెక్టర్ నితేశ్‌ తివారీ రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ ఖరారయ్యారని టాక్. ఇక సీతగా మొదట ఆలియా భట్ ను అనుకున్నా, తర్వాత సాయి పల్లవి పేరు మార్మోగింది. అయితే తాజాగా ఆమె స్థానంలో జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. నితేశ్‌ తివారీ ఆఫీస్ వద్ద తాజాగా జాన్వీ కనిపించడంతో ఈ ప్రచారం జోరందుకుంది. లుక్‌ టెస్ట్‌ కోసమే ఆమె అక్కడికి వెళ్లినట్లు టాక్. 

మరోవవ ైపు రామ్ చరణ్‌- బుచ్చిబాబు కాంబోలో రానున్న సినిమాలోనూ జాన్వీ కపూర్‌ ఓకే అయినట్లు సమాచారం. ఈ స్క్రిప్ట్‌ ఆమెకు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సైన్ చేసినట్లు తెలుస్తోంది.  ఇదే నిజమైతే తెలుగులో జాన్వీ చేసే సెకండ్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ దేవరలో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఈ బాలీవుడ్ బ్యూటీ వరుసగా టాలీవుడ్ లో ఛాన్సులు కొట్టేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version