న్యాయమే గెలుస్తుంది, నిజమే నిలుస్తుంది అంటూ జానీ మాస్టర్ ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ పై తాజాగా ఓ ఛానెల్ కు బాధిత కొరియోగ్రాఫర్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. జానీ మాస్టర్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీంతో స్వయంగా జానీ మాస్టర్ స్పందించారు. తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుందన్నారు.
ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారని ఆగ్రహించారు జానీ మాస్టర్. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదని తెలిపారు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుందని ప్రకటించారు జానీ మాస్టర్.
తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది.
ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు…
— Jani Master (@AlwaysJani) January 29, 2025