జాన్వి కపూర్, ఈ అందాల బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో జాన్వి అందాల దోస్ పెంచుతూ మంత్ర ముగ్దులను చేస్తుంది. వెరైటీ డ్రెస్సులతో జాన్వి చేసే రచ్చ కి కుర్రాళ్ళు మతులు పోతున్నాయి. అయితే.. తాజాగా ఎన్టీఆర్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది ఈ హాట్ బ్యూటీ.
ఇటీవల ఒకానొక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ, నేటి టాలీవుడ్ యువనటుల్లో అందరూ తనకు ఇష్టమైనవారే అని, అయితే ముఖ్యంగా తనకు అవకాశం వస్తే మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో కలిసి ఒక సినిమా చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు జాన్వి. ఇటీవల తాను ఆర్ ఆర్ ఆర్ మూవీ చూశానని అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చారు జాన్వి.