జూ ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ షాకింగ్ రెమ్యునరేషన్..!!

-

సీనియర్ హీరోయిన్ శ్రీదేవి తెలుగు లో తో పాటు బాలీవుడ్ లో కూడా తన దైన ముద్ర వేసింది. ఆమె అందానికి ఫిదా కాని అభిమానులు ఎవరూ లేరు. అయితే  దురదృష్ట వశాత్తూ ఆమె మనల్ని విడిచి వెళ్ళిపోయింది. ఇక ఆమె అబిమానులు ఆమె కూతురైన జాన్వీ కపూర్ లో ఆమెను చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అయితే ఆమె ఎప్పటినుండో తెలుగు పరిశ్రమ లోకి అడుగు పెడుతుంది అని ప్రచారం జరుగుతోంది.

ఇక ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఫోటోస్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక ఆమె సౌత్‌ ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తుందా? అని దక్షిణాది సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ఆమె జూనియర్‌ ఎన్టీఆర్‌, విజయ్‌ సేతుపతితో కలిసి నటించాలని ఉందని మనసులోని మాట బయటపెట్టింది. తాజాగా ఇందులో ఒక కోరిక మాత్రం తెరిపోతున్నట్లు కన్ఫర్మ్ అయిపొయింది.

తాజాగా జూ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం NTR 30 లో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది అని తెలిపారు. ఈమె క్రేజ్ కోసం జాన్వీ కపూర్ భారీగా డిమాండ్ చేస్తుందని సమాచారం అందుతోంది. ఇక్కడ చిన్న సినిమా బడ్జెట్ అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందాల తార శ్రీదేవి కూతురు దిగాలంటే అంత మొత్తం ఇచ్చుకోవాల్సిందే అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version