ఎట్టకేలకు మూడో పెళ్లిపై నోరు విప్పిన జయసుధ..తన కోసమే అంటూ..!

-

ప్రముఖ సీనియర్ నటి.. సహజ నటి గా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఆమె 50 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో రకాల పాత్రలు పోషించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో పాత్రలు పోషిస్తూ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు పరిమితమై మరింత పాపులారిటీ దక్కించుకుంది. అందుకే ఈమెకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా.. జయసుధ సీక్రెట్ గా మూడో పెళ్లి చేసుకున్నవార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఈ అంశం కాస్త హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఆమెతో ఒక వ్యక్తి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఆమె పక్కనే కనిపించడంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై జయసుధ స్పందించింది. ఆ వ్యక్తి ఎవరో కూడా క్లారిటీ ఇచ్చేసింది. అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని, తన బయోపిక్ తీసేందుకే ఇండియాకు వచ్చారు అని, జయసుధ స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు ప్రతి ఈవెంట్ కు హాజరవుతున్నారు అని కూడా వెల్లడించింది.

అతని పేరు ఫెలిఫే రూయేల్స్ .. నా బయోపిక్ తీస్తున్నారు. అయితే గతంలో అమెరికా వెళ్ళినప్పుడు కొంతకాలం అక్కడే ఉన్నాను. నా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో తెలుసుకున్నాడు. కానీ నాకు ఫాలోయింగ్ ఎలా ఉంది ?నా సినిమాలో, షూటింగ్స్ ల వివరాలు తెలుసుకోవడానికి నన్ను ఫాలో అవుతున్నాడే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఇటీవల నేను అమెరికా వెళ్లి అతడిని కలిసాను అంటూ చెప్పుకొచ్చారు జయసుధ. మొత్తానికి జయసుధ మాటలతో పెళ్లి పుకార్లకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version